Published On: Fri, May 9th, 2014

Venky Very Busy With Remakes

Victory-Venkatesh-Latest-Photos     వెంకీ బిజీబిజీ

విక్టరీ వెంకటేష్‌ వరుసగా రీమేక్‌ సినిమాలపై దృష్టి సారించాడు. తను చివరిగా చేసిన మసాలా సినిమా హిందీ రీమేక్‌. వెంకీ ప్రస్తుతం చేస్తున్న సినిమా కూడా మలయాళ సినిమా దృశ్యం సినిమాకి రీమేక్‌. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ భాగ్యనగరంలో శరవేగంగా జరుగుతోంది. కొన్ని కీలక సన్నివేశాలను షూట్‌ చేస్తున్నారు. ఈ షూటింగ్‌లో సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్న అందరూ పాల్గొంటున్నారు. ఈ మూవీలో వెంకటేష్‌కి జోడీగా మీనా కనిపించనుంది. లేడీ డైరెక్టర్‌ శ్రీ ప్రియ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రస్తుత సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను కళ్ళకు కట్టినట్లు చూపించనున్నారు. డి.సురేష్‌ బాబు  రాజ్‌ కుమార్‌ థియేటర్‌‌స  వైడ్‌ యాంగిల్‌ క్రియేషన్‌‌స వారు కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. వెంకటేష్‌ ఈ సినిమా తరవాత పవన్‌ కళ్యాణ్‌ తో కలిసి ఓ మై గాడ్‌ రీమేక్‌ లో నటించనున్నాడు. ఈ సినిమా షూటింగ్‌ ఈ నెల 19 నుంచి సెట్‌‌స పైకి వెళ్లనుంది.