Published On: Thu, May 15th, 2014

Telugu director Maruti Heading To Bollywood

Share This
Tags

బాలీవుడ్‌కి మారుతి

ఈ రోజుల్లో, బస్టాప్‌లాంటి యూత్‌ఫుల్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ని నిర్మించిన దర్శకుడు మారుతి.. ఇప్పుడు బాలీవుడ్‌కి పరిచయం కాబోతున్నాడు. కెమెరామెన్‌ జె.ప్రభాకర్‌రెడ్డి దర్శకత్వంలో మారుతి సమర్పణలో తెరకెక్కిన `ప్రేమకథాచిత్రమ్‌’ని హిందీలో రీమేక్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన పోస్‌‌ట ప్రొడక్షన్‌ కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. అన్నీ కుదరితే త్వరలోనే ఈ సినిమా సెట్‌‌స మీదకు వెళ్ళనుంది. అలాగే తెలుగులో నితిన్‌, నాగచైతన్య, సునీల్‌, రవితేజ, వెంకటేష్‌… ఇలా వరుసబెట్టి హీరోల కోసం పలు కోణాల్లో కథలు సిద్ధం చేసుకుని ప్రస్తుతం వారికి వినిపించే పనిలో ఉన్నాడు మారుతి. వీరందరితోనూ…. తన వరుస ప్రాజెక్టులు వుంటాయనేది ప్రచారం జరుగుతోంది. ఓ వైపు బూతు సినిమాల దర్శకుడు అని పేరు తెచ్చుకున్న మారుతి… ప్రేమకథాచిత్రమ్‌తో ఇతను క్లీన్‌ ఎంటర్‌టైనర్‌ కూడా తీయగలడు అని నిరూపించుకున్నాడు. ఇటీవల విడుదలైన కొత్తజంట సినిమాతో అది మరింత రూడీ అయింది. ఇప్పుడు బాలీవుడ్‌లో అడుగుపెడుతున్నాడు. మరి అక్కడ సక్సెస్‌ అవుతాడా అనేది వేచి చూడాలి. తెలుగు దర్శకులు ఇప్పటి వరకు కె.రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి, పూర్ణచందర్‌రావు, తాతినేని రామారావు, రవిరాజా పినిశెట్టి బాలీవుడ్‌లో సినిమాలు తీశారు. వాళ్ళ తరువాత ఇప్పుడు మారుతి అక్కడికి వెళుతున్నారు.
Kotha-Janta-Telugu-Movie-Trailer-Launch