Published On: Tue, May 13th, 2014

హీటెక్కించడానికి రెడీ!

హీటెక్కించడానికి రెడీ!

సినిమా అంటేనే గ్లామర్‌. కురక్రారు కళ్లు వెతికేదే అందుకు. వాస్తవంగా యువతరాన్ని థియేటర్లకు రప్పించాలంటే అందాల ప్రదర్శన షూరూ! నేనింకా హద్దుల్లో ఉంటేనే ముద్దొస్తాను.. అనుకుంటే అవకాశాలిచ్చే పరిశ్రమ కాదిది. అందుకే కథానాయికలు మడికట్టుకు కూచోడానికి సిద్ధంగా లేరు. మేం అందాల ప్రదర్శన చేయం. లిప్‌లాక్‌లు వేయం. బికినీలు కుదరదు. టూపీస్‌కి నో.. అంటే అలాంటి వారిని మన దర్శకనిర్మాతలు సాధ్యమైనంత దూరంగా పెట్టేస్తున్నారు. అందుకే చాలామంది అందగత్తెలు ఉన్నా.. కెరీర్‌ విషయంలో వెనుకబాటు తనం అందుకే. స్నేహ, కస్తూరి లాంటి ఫ్యామిలీ నాయికలే టూపీస్‌ బికినీలకు నో చెప్పడం వల్ల గొప్ప గొప్ప అవకాశాల్ని కోల్పోవాల్సొచ్చింది. అందుకే నవతరం కథానాయికలు ఏమాత్రం గ్లామర్‌ విషయంలో దాచుకునే ప్రయత్నం చేయడం లేదు. అందాల అనుష్క సూపర్‌ సినిమాతో వస్తూనే అందాల్ని ధారాళంగా ఆరబోసింది. ఆ తర్వాత బిల్లా సినిమాలో బికినీలో ఈ అమ్మడు ప్రదర్శించిన అందాలు చూసి కురక్రారు కంటి మీద కునుకు లేకుండా పోయారు. అలాగే తమన్నా చరణ్‌ సరసన ఆడిపాడిన రచ్చ సినిమాలో ఓ రేంజులో అందాలు ఆరబోసింది. అంతకంటే ముందే 100„% లవ్‌లో అయితే టీనేజర్లకు కిక్కెక్కిపోయేలా చేసింది. రెబల్‌లో అయితే రెచ్చిపోయి నడుము, నాభి సొగసుల్ని వండి వార్చింది. అలాగే సమంత కూడా ఇటీవలి కాలంలో కాస్త హద్దు మీరుతోంది. మహేష్‌ దూకుడులో చీరలోనే బొడ్డు చూపించడానికి పోటీ పడింది. ఇప్పటివరకూ మరీ అంత రేంజులో రెచ్చిపోకపోయినా.. ఇక ముందు అజిత్‌ సరసన నటించిన ఓ సినిమాలో ట్రాన్‌‌సఫరెన్సీగా కనిపించే దుస్తుల్లో పిక్కలపైకి సొగసుల్ని చూపిస్తూ కనిపిస్తోంది. ఆ స్టిల్‌‌స ఇప్పటికే నెట్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. దీన్ని బట్టి ఇక సమంత కూడా హద్దులు చెరిపేయడానికి రెడీ అని అర్థమైంది. మరో భామ కాజల్‌ను `బిజినెస్‌మేన్‌’లో చూసినవాళ్లు అంత తేలిగ్గా మర్చిపోలేరు. అంతకంటే ముందే `దడ’ సినిమాలో దివ్వాళి దీపాన్ని.. ఊరించే అందాన్ని అంటూ చాలా గ్లామరస్‌గా కనిపించింది. ఈ పాత్రలో ఇంత అవసరం అనుకుంటే అంతా అందాల్ని ప్రదర్శించడానికి కాజల్‌ సైతం వెనుకడాడం లేదు. సన్నజాజి నడుము ఉన్న చిన్నది ఇలియానా తొలిసినిమా దేవదాసులోనే నడుము సొగసుల్ని, బొడ్డు అందాల్ని ఆవిష్కరించింది. స్నేహితుడు సినిమాలో ఇల్లియానా చిల్లియానా.. అంటూ అమ్మడు ప్రదర్శించిన అందాల్ని కొరకొర చూశారు కురజ్రనం. ఇప్పుడు బాలీవుడ్‌లో రెచ్చిపోయి మరీ అందాల్ని ప్రదర్శిస్తోంది. అక్కడ లిప్‌లాక్‌లు కూడా వేస్తూ నిత్యం టచ్‌లో ఉంటోంది. ఇటీవలే మై తేరే హీరో సినిమాలో రెచ్చిపోయి అదరచుంబనాల్లో లీనమైపోయింది అమ్మడు. అలాగే లేటుగా వచ్చినా లేటెస్టుగా వస్తా.. అన్నట్టు అందాల శృతిహాసన్‌ ఏ హీరోయిన్‌ ఆ రేంజులో చూపించలేదేమో! అనేంతగా రెచ్చిపోతోంది. బలుపు సినిమా నుంచి ఈ అమ్మడు గ్లామర్‌ని వడ్డించడంలో ఏమాత్రం మొహమాటం పడడం లేదు. ఎవడు సినిమాలో సెక్సీగా కనిపించే కొన్ని ఫోటోల్ని ఇటీవల ఎవరో ఆకతాయిలు నెట్‌లో లీక్‌ చేశారు. దానికి మండిపడిన శృతి పోలీస్‌ కేసు అంటూ నానా హడావుడి చేసింది. తన అనుమతి లేకుండా లీక్‌ చేశారని రభస చేసింది. ఇటీవలే రిలీజైన హిట్‌ చిత్రం రేసుగుర్రంలోనూ శృతి అందాల ప్రదర్శన పెద్ద టాపిక్‌ అయ్యింది. ఇలా అందాల్ని ఏ స్థాయిలో ఆవిష్కరిస్తే .. ఆ రేంజులో పేరు ప్రఖ్యాతులు వస్తాయి. హిట్టొస్తుంది. డబ్బు ముడుతుంది. అదీ ఫార్ములా.