Published On: Sun, May 11th, 2014

రామ్‌చరణ్‌కి తీవ్ర జ్వరం

రామ్‌చరణ్‌కి తీవ్ర జ్వరం

ఇటీవల ఓటేయడానికి స్వామి దుస్తుల్లో కనిపించిన చరణ్‌ని చూసి అందరూ సినిమా షూటింగ్‌లో పాల్గొనట్లేదా అనుకున్నారు. అయ్యప్ప దీక్షలో ఉన్నట్లున్నారు అనుకున్నారంతా. అయితే దీక్షలో ఉన్నా… చరణ్‌ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఓవైపు దీక్షలో ఉంటూనే షూటింగ్‌లో రాత్రనకా… పగలనకా పాల్గొంటున్నాడు. అయితే ఇటీవల రామ్‌ చరణ్‌ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. కృష్ణవంశీ దర్శకత్వంలో గోవిందుడు అందరి వాడేలే చిత్రం షూటింగ్‌ సమయంలో తీవ్ర అస్వస్థతతో బాధపడ్డారు. రామ్‌ చరణ్‌ షూటింగులో పాల్గొనలేని స్థితిలో ఉండటంతో షూటింగ్‌ తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు కృష్ణ వంశీ ప్రకటించారట. ఈ విషయాన్ని రామ్‌ చరణ్‌ స్వయంగా తన సోషల్‌ నెట్వర్కింగ్‌ పేజీ ద్వారా అభిమానులకు తెలియజేసాడు. హై ఫీవర్‌తో బాధ పడ్డాను. జ్వరం కారణంగా నా పరిస్థితి చాలా బ్యాడ్‌గా ఉంది. గోవిందుడు అందరి వాడేలే సినిమా షూటింగ్‌ కొన్ని రోజులు ఆపక తప్పలేదు. త్వరలో కోలుకుని షూటింగులో పాల్గొంటాను అని తెలిపాడు.
ramcharan-tej