Published On: Fri, May 9th, 2014

Pawan Kalyan Is God

Pawan-Kalyan-Is-God

 

అప్పుడే దేవుడికి పని!

మల్లీస్టారర్ల ఒరవడి ఇటీవలి కాలంలో విపరీతంగా పెరిగిపోయింది. మెగా మల్టీస్టారర్‌, అక్కినేని మల్టీస్టారర్‌, మంచు మల్టీస్టారర్‌, దగ్గుబాటి మల్టీస్టారర్‌ ..ఇలా ఉంది వరుస. అయితే ఈసారి అందుకు భిన్నమైన మల్టీస్టారర్‌ తెరకెక్కుతోంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో మహేష్‌, వెంకీ కాంబినేషన్‌ బాగా సెట్టయ్యిందని పేరొచ్చింది. అదే కోవలో ఈసారి పవన్‌, వెంకీ కాంబినేషన్‌కి సెట్టింగ్‌ చేస్తున్నారు. డి.సురేష్‌బాబు, శరత్‌మరార్‌ ఇద్దరూ నిర్మాతలుగా బాలీవుడ్‌ హిట్‌ చిత్రం `ఓ మై గాడ్‌’ని రీమేక్‌ చేస్తున్నారు. ఈ సినిమాలో వెంకీ పరేష్‌రావల్‌ పోషించిన పాత్రలో కనిపిస్తారు. పవన్‌ కల్యాణ్‌ దేవుడిగా కనిపిస్తాడు. ఒరిజినల్‌లో దేవుడిగా అక్షయ్‌కుమార్‌ కనిపించాడు. భక్తుడు దేవుడిమీద పిల్‌ వేస్తే? ఆ తర్వాత ఏం జరిగింది? అనే ఫన్నీ కథతో రూపొందినా.. ఈ సినిమా జనాల మెదడుకి పనిచెప్పేలా ఉంటుంది. అందుకే ఉత్తరాదిన పెద్ద విజయం సాధించింది. తెలుగువారి సెంటిమెంట్‌లకు అద్దం పట్టేలా ఈ సినిమాలో ఎన్నో అంశాల్ని ఏర్చి కూర్చడానికి ఆస్కారం ఉంది. అందుకే ఇప్పుడు నిర్మాతలు డిఫరెంట్‌ కాంబినేషన్‌ సెట్‌ చేశారు. పవన్‌ చేరికతో ఈ సినిమాకి మార్కెట్‌ రేంజ్‌ పెరిగిపోయింది. త్వరలోనే సినిమా ప్రారంభం కానుంది. నానక్‌రామ్‌గూడ రామానాయుడు విలేజీలో ఇప్పటికే సెట్‌ను నిర్మిస్తున్నారు. ముందుగా వెంకీతో కూడిన సన్నివేశాల్ని తెరకెక్కిస్తారు. జూన్‌లో పవన్‌ ఎంట్రీ ఉంటుందని సమాచారం. అంటే దేవుడు ఇంకా రానక్కర్లేదన్నమాట! జూన్‌ వరకూ టైముంది.