Published On: Sun, May 11th, 2014

నీలకంఠ మాయ

నీలకంఠ మాయ

జాతీయ అవార్‌‌డ గ్రహీత నీలకంఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `మాయ’. హర్షవర్దన్‌రాణే, అవంతిక, సుష్మ, నందినీరాయ్‌ ప్రధాన తారాగణం. షిర్డిసాయి కంబైన్‌‌స
పతాకంపై డా.ఎం.వి.కె.రెడ్డి-మధుర శ్రీధర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నిర్మాణాంతర కార్యక్రమాలు
శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రం ఫస్‌‌టలుక్‌ను శనివారం ప్రసాద్‌ల్యాబ్‌లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మల్టీడైమన్షన్‌ రామ్మోహన్‌రావు ఫస్‌‌ట లుక్‌ పోస్టర్‌ని విడుదల చేశారు. నిర్మాద దామోదర ప్రసాద్‌, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ్‌ స్వీకరించారు. “నీలకంఠ చేసే ప్రతి సినిమా కథ, కథనాల్లో కొత్తదనాన్ని చూపిస్తాడు. ఓ కొత్త కథాంశంతో తెరకెక్కించిన మాయ సినిమా కూడా ప్రేక్షకుల్ని అలరిస్తుందని ఆశిస్తున్నా” అన్నారు దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ్‌. దర్శకుడు నీలకంఠ మాట్లాడుతూ “ఎక్‌‌సట్రా సెన్సరీ పర్‌సెప్షన్‌ కాన్సెప్‌‌ట మీద ఎంతగానో రీసెర్‌‌చ చేసి ఈ కథ రాశాను. మనుషులలో ఉండే అతీంద్రియ దృష్టి నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం ఇది. నా డ్రీమ్‌ ప్రాజెక్‌‌ట ఇది. వైవిద్యంతో సాగే థ్రిల్లర్‌గా `మాయ’ను తీర్చిదిద్దాను. కొత్తదనాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారు. మాయ సినిమా ప్రేక్షకులకి సరికొత్తగా ఉంటుంది” అన్నారు. మధుర శ్రీధర్‌ మాట్లాడుతూ “నీలకంఠది, నాది ఇరవైఏళ్ళ జర్నీ. మాకు సినిమా మేకింగ్‌ అంటే ప్రాణం. నీలకంఠని సినిమా వ్యవసాయదారుడనొచ్చు. ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు. మాయ సినిమా బెస్‌‌ట థ్రిల్లర్‌ ్ఞఅవుతుంది. పోస్‌‌ట ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. శేఖర్‌చంద్ర సంగీతం, బాల్‌రెడ్డి ఫొటోగ్రఫీ, నవీన్‌ నూలి ఎండిటింగ్‌ పనితనం ఈ చిత్రాన్ని మరోమెట్టు ఎక్కించాయి. మేలో పాటల్ని, జూన్‌లో సినిమాని విడుదల చేస్తాం” అన్నారు. ఈ కార్యక్రమంలో
హీరో హర్షవర్దన్‌రాణెneelakantha, అవంతిక, సుష్మ, శేఖర్‌చంద్ర తదితరులు పాల్గొని ప్రసంగించారు.