Published On: Tue, May 13th, 2014

మరోసారి వార్‌!

మరోసారి వార్‌!

ఇద్దరు స్టార్‌ హీరోల సినిమాలు ఒకే సమయంలో విడుదల కావడం ఇద్దరికీ మంచిది కాదని అంటుంటారు. అయినా కానీ ఒక్కోసారి క్లాష్‌లు అవాయిడ్‌ చేయలేరు. గత ఏడాది సంక్రాంతికి వచ్చిన ‘నాయక్‌’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ రెండింటికీ మధ్య జరిగిన పోటీలో ఇద్దరి చిత్రాలు ఎంతో కొంత నష్టపోయాయి. విడివిడిగా వచ్చి ఉంటే ఆ చిత్రాలకి మరింత లాభం వచ్చి ఉండేదేమో. ‘సీతమ్మ వాకిలి’పై ఆంధ్రప్రదేశ్‌లో ‘నాయక్‌’ ఆధిపత్యం చలాయిస్తే, ఓవర్సీస్‌లో ‘సీతమ్మ’దే పైచేయిగా నిలిచింది. సేమ్‌ కాంపిటీషన్‌ మళ్లీ మొన్న సంక్రాంతికి రిపీట్‌ అయితే ఎవడు గట్టున పడి, నేనొక్కడినే డిజాస్టర్‌ అయింది. చూస్తుంటే మరోసారి ఈ పోటీ తప్పదనే సంకేతాలు వస్తున్నాయి. మళ్లీ బాక్సాఫీస్‌ వద్ద మహేష్‌, చరణ్‌ క్లాష్‌ జరుగుతుందనే టాక్‌ వినిపిస్తోంది. మహేష్‌ ఆగడు, చరణ్‌ గోవిందుడు అందరివాడేలే దసరాకి అయిదు రోజుల గ్యాప్‌తో రిలీజ్‌ అవుతాయని టాక్‌. సంక్రాంతికి మహేష్‌ సినిమాకి చరణ్‌ చేసిన డ్యామేజ్‌కి బదులుగా ఈసారి మహేష్‌ ఆగడుతో బ్లాక్‌ బస్టర్‌ కొట్టి గోవిందుడి ఆశలపై నీళ్లు చల్లేస్తాడని సూపర్‌స్టార్‌ ఫాన్‌‌స ఆశిస్తున్నారు. విడుదలకి ముందు మరోసారి మహేష్‌ సినిమానే స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నా కానీ ఈ క్లాష్‌ ఆఫ్‌ ది టైటాన్‌‌సలో సక్సెస్‌ ఎవరిదో ఇప్పుడే చెప్పడం కష్టమే.