Published On: Tue, May 13th, 2014

అందమైన ప్రేమకథ

అందమైన ప్రేమకథ

క్రియేటివ్‌ కమర్షియల్‌‌స పతాకంపై ప్రముఖ నిర్మాత కె.ఎస్‌.రామారావు నిర్మిస్తున్న తాజా చిత్రం మొదటి షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. రెండో షెడ్యూల్‌ని త్వరలో ప్రారంభించబోతోంది. ఇంకా టైటిల్‌ నిర్ణయించని ఈ చిత్రంలో `శర్వానంద్‌-నిత్యామీనన్‌’ జంటగా నటిస్తున్నారు. ఓనమాలు సినిమా దర్శకుడు క్రాంతి మాధవ్‌ దర్శకుడు. `కృష్ణం వందే జగద్గురుం’ ఫేం బుర్రా సాయిమాధవ్‌ మాటలు అందిస్తున్నారు. పునర్నవి, తేజశ్వి ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం రెండో షెడ్యూల్‌ జూన్‌ 1 నుంచి హైదరాబాద్‌లో ప్రారంభం అవుతుంది. నిర్మాత మాట్లాడుతూ “చాలా కాలం తరువాత మా సంస్థ నుంచి వస్తున్న ఒక మంచి సినిమా ఇది. దర్శకుడు ఈ చిత్రాన్ని ఓ అద్భుత ప్రేమ కావ్యంగా తీర్చిదిద్దుతున్నారు. ఇటీవల వైజాగ్‌, భీమిలి పరిసర ప్రాంతాల్లో కీలక పాత్రధారులందరూ పాల్గొనగా… మొదటి షెడ్యూల్‌ని పూర్తి చేశాం. హీరో హీరోయిన్లపై 50 లక్షల రూపాయల సెట్లో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించాం. ఇవి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇప్పటి వరు యాభైశాతం షూటింగ్‌ పూర్తయింది. ఇందులో ఒక పాట కూడా పూర్తయింది” అన్నారు. ఈ చిత్రంలో తనికెళ్ళ భరణి, ఆహుతి ప్రసాద్‌, సన, లోకేష్‌, తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్‌, కూర్పు: మధుసూదన్‌రెడ్డి, కళ: సాహి సురేష్‌, ఫొటోగ్రఫీ: జ్ఞానేశ్వర్‌, నిర్మాత: కె.వల్లభ, సమర్పకులు: కె.ఎస్‌.రామారావు.