Published On: Fri, May 9th, 2014

Aadi Telugu Hero Interview

Share This
Tags

Aadi-Telugu-Hero-Interview

 

 

మ్యూజికల్‌ లవ్‌స్టోరీ ప్యార్‌ మే పడిపోయానే -ఆది

సాయి ఆర్‌‌ట్స పతాకంపై ఆది, శాన్వి జంటగా నటిస్తున్న చిత్రం `ప్యార్‌ మే పడిపోయానే’. కె.కె.రాధామోహన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి చావలి దర్శకుడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా హీరో ఆది మాట్లాడుతూ “సుకుమారుడు సినిమా తరువాత చాలా మంది లవ్‌ స్టోరీలు చేయమని చెప్పారు. అదే సందర్భంలో రవి చావలి గారు నాకు ఈ సినిమా కథ వినిపించారు. తన జోనర్‌కి భిన్నంగా వెళ్ళి చేస్తున్న సినిమా అని కూడా చెప్పారు. నాకు కథ నచ్చింది. అదీ గాక సింపుల్‌ స్క్రిప్‌‌ట. మ్యూజికల్‌ లవ్‌స్టోరీ. 80 శాతం ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉంటుంది. కూల్‌ ఎంటర్‌టైనర్‌. ఈ సినిమాలో ఫ్రెష్‌నెస్‌, నా క్యారెక్టర్‌ బాగా నచ్చింది. అలాగే నిర్మాత రాధామోహన్‌ లవ్‌లీ తర్వాత నాతో ఓ సినిమా చేయాలనుకున్నారు. ముందుగా వేరే సబ్జెక్‌‌ట అనుకున్నా. కొన్ని కారణాల వల్ల కుదరలేదు. ఇప్పటికి కుదిరింది. లవ్‌లీ సినిమాతో శాన్వి, నాది పెయిర్‌ బాగుందని చాలా మంది అప్రిషియేట్‌ చేశారు. అందుకే తనని ఈ సినిమాలో తీసుకున్నాం. అనుప్‌ మనం, ఆటోనగర్‌ సూర్య సినిమాలతో బిజీగా ఉన్నా… నాతో ఉన్న రిలేషన్‌ కారణంగా ఈ సినిమా చేశారు. మంచి మ్యూజిక్‌ ఇచ్చారు. ఆడియో హిట్టయింది. కృష్ణారెడ్డి ఎడిటింగ్‌, సురేంద్రరెడ్డి సినిమాటోగ్రఫీ సినిమాకి ప్లస్‌. అన్నపూర్ణ యాక్టింగ్‌ స్కూల్‌ నుంచి నలుగురిని ఈ సినిమా ద్వారా నా ఫ్రెండ్‌‌సగా చిత్ర పరిశ్రమకి పరిచయం చేస్తున్నాం. ఐదు కామెడీ ట్రాక్‌లో సినిమాకి హైలైట్‌. ఇందులో శాన్వి సింగర్‌గా నటించింది. లవ్‌ చేయాలి కానీ… అందుకోసం చావకూడదు అనే క్యారెక్టర్‌ నాది. అలాంటిది చివరికి ప్రేమించిన పిల్ల కాదంటే చనిపోతా అనే రేంజ్‌కి చేరుకునే క్యారెక్టర్‌ నాది. చివరికి ప్రేమను ఎలా గెలిపించుకున్నాం అనేదే కథాంశం. రఫ్‌ సినిమాకోసం సిక్‌‌స ప్యాక్‌ చేశా. త్వరలో అది ప్రేక్షకుల ముందుకు వస్తుంది. నా వయసుకి తగ్గ లవ్‌స్టోరీలు, కమర్షియల్‌ సినిమాలు చేయాలనుకుంటున్నా. తెలుగులో నేను ప్రూవ్‌ చేసుకున్న తరువాత కన్నడ గురించి ఆలోచిస్తా” అన్నారు.