మళ్ళీ ఒక్కటయ్యారు!
మళ్ళీ ఒక్కటయ్యారు!
ఇపుడు కోలీవుడ్‌లో మరో హాట్ న్యూస్ ప్రచారమవుతోంది. గతంలో విడిపోయిన శింబు, నయనతార జంట ఇపుడు సెకండ్ ఇన్నింగ్స ప్రేమ నడుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఒకరనినొకరు విడిచి ఉండలేనంత స్థితి వరకూ కలిసిపోయారు. కానీ ఏమైందో ఏమో కానీ ఈ జోడి తమ ప్రేమకు ఫుల్స్టాప్ పెట్టింది. ఆ తర్వాత నయన్ ప్రభుదేవాతో ప్రేమాయణం నడపగా, శింబు హన్సికతో తిరగడం మొదలెట్టాడు. కానీ ఆ బంధాలు ఎంతకాలం నిలవలేదు. ఇటీవలే హన్సికతో ప్రేమాయణానికి గుడ్‌బై చెప్పేసిన శింబు సింగిల్‌గా ఉన్నాడు. నయనతార కూడా అంతే. ప్రభుదేవాతో విడిపోయి తన మనసును ఖాళీ చేసుకుంది. ఇంతలో శింబు, నయనతార జంటకు దర్శకుడు పాండిరాజ్ ఓ కథ చెప్పి ఒప్పించాడు. ఈ సినిమా కోసం వీరిద్దరూ ఇపుడు షూటింగ్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో వీరిమధ్య మళ్లీ ప్రేమ చిగురించిందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇటీవల త్రిష బర్తడే వేడుకల్లో ఈ జంట సందడి చేసింది. అంతేకాకుండా శింబు, నయనతార ఒకరినొకరు హత్తుకుని కౌలిగిలించుకుని ఫోటోలకు ఫోజిలిచ్చారట. తాజాగా ఈ ఫోటోలు బయటకు రావడంతో మళ్లీ వీరిద్దరు ప్రేమలో పడ్డారని స్పష్టమవుతోంది. ఇంకా ఈ జోడీ మరో సినిమా చేయడానికి కూడా గ్రీన్ సిగ్నెల్ ఇచ్చినట్లు సమాచారం.