Published On: Thu, May 15th, 2014

టాలీవుడ్‌పైనే మోజు

టాలీవుడ్‌పైనే మోజు

మహేష్‌బాబుతో కలిసి `1′(నేనొక్కడినే) సినిమాలో హీరోయిన్‌గా నటించిన కృతిసనన్‌… ఈ సినిమా తర్వాత కృతికి టాలీవుడ్‌లో మంచి ఆఫర్లు వస్తాయని అందరూ భావించారు. కానీ ఇప్పటి వరకూ ఒక్క సినిమా కూడా కమిట్‌ అవ్వలేదు. కానీ బాలీవుడ్‌లో మాత్రం రెండు సినిమాలు చేస్తోంది కృతిసనన్‌. తాజాగా ఆమె టాలీవుడ్‌లో నాగచైతన్యతో కలిసి నటిస్తోందని ప్రచారం జరుగుతోంది. స్వామిరారా ఫేం సుధీర్‌ వర్మ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం జూన్‌ చివరి వారంలో సెట్‌‌సపైకి వెళ్ళనుంది. ఇందులో కృతి హీరోయిన్‌గా నటిస్తోందట. నాగచైతన్యతో కలిసి ఓ యూత్‌ఫుల్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ని సుధీర్‌వర్మ తెరకెక్కించబోతున్నాడు. ఇందులో నాగచైతన్య, కృతిసనన్‌ జంటగా నటించడానికి రెడీ అవుతున్నారట. మరి ఈ అమ్మడు రెండో చిత్రమైనా భారీ విజయం సొంతం చేసుకుని హిట్‌ కొట్టాలని ఆశిద్దాం!
kriti-sanon