Published On: Fri, May 9th, 2014

I am Afraid Of Bollywood Samantha

                         Samantha-Telugu-Actress-Cute-Photos

 

బాలీవుడ్‌ అంటే భయం

ముంబెకి వెళితే అసిన్‌లా అక్కడే ఫిక్సయిపోవాలి. అవకాశాలు వచ్చినా రాకున్నా.. ఒక్కసారి బాలీవుడ్‌ సినిమాల్లో నటిస్తే, ఆ తర్వాత సౌత్‌ సినిమాల్లో నటించడానికి ఇబ్బందులు పడాలి. ఇవన్నీ ఇప్పుడు సమంత మదిలో మెదులుతున్న అనుమానాలు. బాలీవుడ్‌ నుంచి ఎంచక్కా ముద్దుగుమ్మలు సౌత్‌కి వచ్చేస్తారుగానీ.. సౌత్‌ నుంచి బాలీవుడ్‌కి వెళితే కెరీర్‌ చాలామందికి అటకెక్కిపోతుంది. అసిన్‌, తమన్నా, త్రిష, కాజల్‌.. ఇలా చాలామంది హీరోయిన్ల పరిస్థితి ప్రస్తుతం తెలుగులో ఎలా వుందో అందరికీ తెల్సిందే. వున్నంతలో కాజల్‌ కాస్త బెటర్‌ అంతే. అసిన్‌ అయితే, బాలీవుడ్‌కి వెళ్ళాక సౌత్‌లో మళ్ళీ సినిమాలు చేయలేకపోయింది. పైకెక్కి, కిందకు పడిపోయినట్లే.. అన్న భావనతోనే అసిన్‌ ముంబెలో ఫిక్సయిపోయి, సౌత్‌ని లైట్‌ తీసుకుంది. సమంతకీ ఇప్పుడు బాలీవుడ్‌ నుంచి అవకాశాలు వస్తున్నాయి. సౌత్‌లో స్టార్‌ డమ్‌ని వదిలేసుకుని బాలీవుడ్‌కి వెళ్ళే విషయమై సమంత ఎటూ తేల్చుకోలేకపోతోంది. ఒక్కసారి బాలీవుడ్‌కి వెళితే.. అక్కడి వాతావరణం అలవాటైతే.. సౌత్‌కి రావడం కష్టం.. సౌత్‌ నుంచి అవకాశాలొచ్చినా ఇక్కడి సినిమాలకి టైమ్‌ కేటాయించడానికి కుదరదు. బాలీవుడ్‌ కమిట్‌మెంట్‌‌స అలా వుంటాయ్‌ మరి. చేతినిండా సినిమాలతో సమంత ఈ ఏడాది బిజీగా వుంది. తెలుగు, తమిళ వెర్షన్‌ లలో భారీ చిత్రాలలో ఈ భామ నటిస్తుంది. ఇటీవలే అలెప్పీ వెళ్ళిన ఈ భామ ఇప్పుడు త్వరలో వి.వి వినాయక్‌ సినిమా కోసం ఇటలీ వెళ్లనుంది  అందుకే సమంత ఇప్పుడు సందిగ్ధావస్థలో పడిపోయింది. బాలీవుడ్‌కి వెళ్ళకపోవడమే బెటర్‌.. అన్న ఆలోచనకి వచ్చేసిందట ఇప్పుడు సమంత.