Published On: Tue, May 13th, 2014

దిమ్మతిరిగి మైండ్‌ బ్లాంక్‌!

Share This
Tags

దిమ్మతిరిగి మైండ్‌ బ్లాంక్‌!

చిన్న హీరోలతో చిన్న సినిమాలు తక్కువ బడ్జెట్‌లో తీసుకుని హిట్‌ కొడితే ఎంత లాభం వస్తుందనేది దిల్‌ రాజుకి బాగా తెలుసు. బొమ్మరిల్లు, కొత్త బంగారు లోకం వంటి బ్లాక్‌బస్టర్లు చూసిన దిల్‌ రాజు అలాంటి హిట్లు పెద్ద హీరోలతో మాత్రం కొట్టలేకపోయాడు. పెద్ద హీరోలతో సినిమా అంటే వారి పారితోషికం, నిర్మాణ వ్యయం కలిపి నలభై, యాభై కోట్లు అయిపోతుంటుంది. దీని వల్ల ఆ చిత్రాలు బ్రేక్‌ ఈవెన్‌ అవడమే గగనమైపోతుంది. పొరపాటు ఒకటి ఫ్లాపయినా కానీ తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుంది. వరుసగా మూడు భారీ సినిమాలు నిర్మించిన దిల్‌ రాజుకి దెబ్బకి నిర్మాణంపైనే విరక్తి, వైరాగ్యం వచ్చేసాయి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ఎవడు హిట్‌ అనిపించుకున్నా కానీ ఆ సినిమాలకి అయిన బడ్జెట్‌కి అవి జస్ట సేఫ్‌ అయ్యాయంతే. అన్ని కోట్లు పెట్టి మన డబ్బులు మనకొస్తే చాలని ఎవరనుకుంటారు. ఒకవేళ మధ్యలో రామయ్యా వస్తావయ్యాలాంటి డిజాస్టర్‌ పడితే పరిస్థితి ఏంటి? ఈ అనుభవాలతో దిల్‌ రాజు ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. పెద్ద హీరోలకో దండం పెట్టేసి చిన్న వాళ్లతో చిన్న సినిమాలేవో తీసుకుంటానని అంటున్నాడు. ఇప్పుడు తన సినిమాలన్నీ తన కంట్రోల్‌లోనే ఉంటాయని, మునుపటిలా మళ్లీ విజయాలు సాధించవచ్చునని దిల్‌ రాజు భావిస్తున్నాడు. అందుకోసం కొంత గ్యాప్‌ తీసుకొని కొత్త చిత్రాలు కొత్త వారితో, చిన్న చిత్రాలు చిన్న హీరోలతో ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం.