Published On: Sun, May 11th, 2014

రజనీతో దీపికా డిష్యుం…డిష్యుం!

రజనీతో దీపికా డిష్యుం…డిష్యుం!

పొడుగు కాళ్ల సుందరి దీపికపదుకొనె.. రోజు రోజుకి పాపులారిటీ పెంచుకుంటూనే ఉంది. అప్పట్లో సైఫ్‌ అలీఖాన్‌ `రేస్‌2′ సినిమాలో, ఇటీవలే రిలీజైన `రామ్‌లీల’ సినిమాలో ఈ అమ్మడి పెర్ఫామెన్‌‌స ఓ టామ్‌ బోయ్‌కి ఏమాత్రం తక్కువ కాదు. అప్పటికప్పుడు ఎక్‌‌సప్రెషన్‌‌స మార్చేస్తూ.. మగరాయుడిలా కనిపించింది అమ్మడు. రొమాంటిక్‌ సన్నివేశాల్లో హీరోలతో జీవించే అమ్మడిగా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు లేటెస్టుగా సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సినిమాలో నటించింది. కొచ్ఛాడయాన్‌, విక్రమసింహా పేర్లతో ఈ సినిమా తమిళ్‌, తెలుగులో విడుదలవుతోంది. ఈ సినిమాలో కొన్ని సర్‌ప్రైజింగ్‌ ఎలిమెంట్‌‌స ఉన్నాయంటూ డైరెక్టర్‌ సౌందర్య రజనీకాంత్‌ చెబుతోంది. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో ఫైట్‌ చేసిన మొట్టమొదటి కథానాయిక దీపిక పదుకొనెనట. ఇందులో రజనీకి సూపర్‌ పవర్‌‌స ఉంటాయి. అదృశ్యమైపోతున్న సూపర్‌స్టార్‌ని వెతికి, ఫైట్‌ చేయడానికి దీపిక వెంటపడుతుందట. ఈ క్రమంలో మార్షల్‌ ఆర్‌‌ట్స ప్రదర్శిస్తుందట. అలా ఛేజ్‌ చేసే సన్నివేశంలో చాలా ఫన్‌ పండిందని చెబుతున్నారు. సినిమాలో చాలా ఆసక్తికర సన్నివేశం కూడా ఇదేనని దర్శకురాలు అంటోంది. ఈ లెక్కన దీపిక పదుకొనె రజనీతో నువ్వా? నేనా? అన్నట్టు పోటీపడిందన్నమాట!
deepika-padukone-rajnikanth