Published On: Tue, May 13th, 2014

ఘాటైన చుంబనం ఇచ్చిన అనుష్క

Share This
Tags

ఘాటైన చుంబనం ఇచ్చిన అనుష్క

స్వీటీశెట్టి అనుష్క తెలుగులో రుద్రమదేవి, బాహుబలి వంటి క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తూనే, తమిళ్‌లో భారీ ప్రాజెక్టులకు సంతకాలు చేస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడు అజిత్‌ సరసన నటిస్తోంది. గౌతమ్‌మీనన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇదే సినిమాలో స్వీటీతో పోటీపడుతూ త్రిష కూడా నటిస్తోందని ఇటీవలే ప్రచారమైంది. అయితే ఈ మధ్య స్వీటీతో గరమ్‌ గరమ్‌ సన్నివేశాల్ని తెరకెక్కించడానికి గౌతమ్‌ ఓ ప్లాన్‌ వేశాడు. అజిత్‌, అనుష్కల మధ్య రొమాంటిక్‌ సన్నివేశాల్ని సదరు దర్శకుడు ప్లాన్‌ చేశాడు. బెడ్‌ రూమ్‌లో ఈ ఇద్దరి మధ్యా హీటెక్కించే సన్నివేశాల్ని తెరకెక్కించడానికి అన్నీ సిద్ధం చేసుకున్నాడట. అంతేకాదు.. ఆ టైమ్‌లో గౌతమ్‌, కెమెరామేన్‌ సహా నాయకానాయికలు మాత్రమే ఆ బెడ్‌రూమ్‌లో ఉన్నారు. మిగతా యూనిట్‌ని కనీసం ఆ దరిదాపులకు కూడా రానివ్వలేదట. మూడు రోజుల పాటు ఆ సన్నివేశాల్ని తెరకెక్కించారు. అన్ని రోజులు యూనిట్‌కి పనేం లేకుండా జీతాలు ఇచ్చారట. దీనిని బట్టి అనుష్క తన కెరర్‌లోనే ఇంతవరకూ చేయని రీతిలో లిప్‌లాక్‌లు వేస్తోందని, బెడ్‌రూమ్‌ సన్నివేశాల్లో నటిస్తోందని కోలీవుడ్‌లో ప్రచారమవుతోంది. రొమాంటిక్‌ సన్నివేశాల్లో జీవిస్తోందని అంటున్నారు. ఏది నిజమో తెరపైనే చూడాల్సిందే.