Published On: Sun, May 11th, 2014

రోమియో ఆడియో ఆవిష్కరణ

Share This
Tags

రోమియో ఆడియో ఆవిష్కరణ

సాయిరాం శంకర్‌ కథానాయకుడిగా టచ్‌స్టోన్‌ ఫిల్‌‌మ ప్రొడక్షన్‌‌స పతాకంపై టచ్‌స్టోన్‌ దొరైస్వామి నిర్మిస్తున్న చిత్రం `రోమియో’. అదోనిక కథానాయిక. పూరీజగన్నాథ్‌ కథ, మాటలు Sairam-Shankar-New-Look-Still-from-Romeo-Movieఅందించిన ఈ చిత్రానికి గోపి గణేష్‌ దర్శకుడు. సునీల్‌ కశ్యప్‌ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగింది. రామ్‌గోపాల్‌ వర్మ ఆడియో సీడీలను ఆవిష్కరించి తొలి సీడీని ఎస్‌.వి.కృష్ణారెడ్డికి అందించారు. దర్శకుడు వి.వి.వినాయక్‌, రాజమౌళి, ఛార్మి, చోటా కె.నాయుడు, దేవిశ్రీప్రసాద్‌, తదితరుల పాల్గొన్నారు. రామ్‌గోపాల్‌ వర్మ మాట్లాడుతూ “నేను తీసే సినిమాలన్నీ డార్‌‌కగా, హారర్‌, ఫ్యాక్షన్‌ నేపథ్యంలో ఉంటాయి. ప్రేమ కథలు చేయడం నాకు కొంచెం కష్టం. రొమాంటిక్‌ లవ్‌స్టోరీలు తీయాలంటే పూరి ది బెస్‌‌ట. రోమియో జూలియట్‌ సినిమా నా ఫేవరేట్‌. ఈ కథకు తగ్గ టైటిల్‌ పెట్టారు.పాటలు, ట్రైలర్‌‌స చూస్తుంటే సాయిరాం శంకర్‌ ఎనర్జీ లెవెల్‌‌స తెలుస్తున్నాయి” అన్నారు. దర్శకుడు పూరీ జగన్నాథ్‌ మాట్లాడుతూ “ఓ షూటింగ్‌ నిమిత్తం అబ్రాడ్‌ వెళ్ళినప్పుడు రోమియో జూలియట్‌ పుట్టిన ప్రాంతాన్ని చూశా. అక్కడ కొన్ని సన్నివేశాలు చూసి ఈ కథ రాశాను. ఈ కథకి తమ్ముడు హీరోగా చేయడం ఆనందంగా ఉంది. సునీల్‌ పర్‌ఫెక్‌‌ట మ్యూజిక్‌ ఇచ్చాడు. నా బ్యానర్‌లో ఇదే టీమ్‌తో ఓ సినిమాని త్వరలో నిర్మిస్తా” అన్నారు. హీరో సాయిరాం శంకర్‌ మాట్లాడుతూ “ఈ సినిమాకి కథను ఇచ్చిన అన్నయ్యకు, గెస్‌‌ట రోల్‌ చేసిన రవితేజకు నా కృతజ్ఞతలు. గోపీ, గణేష్‌ మంచి ఔట్‌పుట్‌ ఇచ్చారు. దర్శకుడిగా అతనికి మంచి భవిష్యత్తు ఉంది.ప్యాషన్‌తో నిర్మాత ఈ సినిమాని తీశారు” అన్నారు. `చక్కటి కథ ఇచ్చిన పూరీకి థ్యాంక్‌‌స, జెమిని కిరణ్‌ లేకుంటే ఈ సినిమా చేసేవాణ్నికాదు. దర్శకుడు ఈ సినిమాకోసం చాలా కష్టపడ్డాడు. సినిమా పట్ల చాలా నమ్మకం ఉంది” అన్నారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు సునీల్‌ కశ్యప్‌ తదితరులు పాల్గొని ప్రసంగించారు.