Published On: Tue, May 13th, 2014

సెలీనా గరమ్‌ గరమ్‌

సెలీనా గరమ్‌ గరమ్‌

బాలీవుడ్‌ హీరోయిన్‌ సెలీనా జైట్లీ అమెరికా విమానయాన సిబ్బందిపై విరుచుకుపడుతోంది. ఏమాత్రం మ్యానర్‌‌సలేని మూర్ఖులంటూ ఛీ కొడుతోంది. అయితే సెలీనాకు అంతగా కోపం రావడానికి కారణమేమిటని ఆరా తీస్తే అసలు విషయం పయటపడింది. లెస్బియన్‌, గే, ట్రాన్‌‌స జెండర్ల హక్కులపై అవగాహన కల్పించే కార్యక్రమానికి సెలీనా వెళ్ళింది. ఐక్యరాజ్యసమితి ప్రచార కర్తగా ఆమె వ్యవహరిస్తున్నారు. ఇదే పనిపై ఇటీవలే ఆమె అమెరికా బయలు దేరారు. అయితే బిజినెస్‌ క్లాస్‌లో ప్రయాణిస్తున్న ఈ అమ్మడితో విమాన సిబ్బందిలో ఒకరు అసభ్యకరంగా ప్రవర్తించారట. ఇదేంటని నిలదీస్తే ఏంచేస్తావో చేసుకోమంటూ అక్కడినుంచి వెళ్ళిపోయాడట. ఇక అమెరికా వెళ్ళగానే అక్కడ ఆ ఎయిర్‌లైన్‌‌స Celina Jaitlyమేనేజ్‌మెంట్‌కు సదరు సిబ్బందిపై సెలినా ఫిర్యాదు కూడా చేసిందట. అయితే ఇప్పటి వరకు దానిపై స్పందన కూడా రాలేదు. దాంతో సెలీనా గరమ్‌ గరమ్‌గా ఉంది. సెలబ్రిటీలకు ఇలాంటివి మామూలే అని సర్దుకున్నా… బయట మాబ్‌లోనో.. మరెక్కడైనా  ఇలాంటి సంఘటనలు ఎదురైతే లైట్‌ తీసుకోవచ్చు గానీ… విమాన యానంలో కూడా ఇలాంటి సంఘటనలు ఎదురైతే ఇక్కడ రక్షణ ఎక్కడ అనేది అందరినీ వేదిస్తున్న ప్రశ్న.