Published On: Tue, May 13th, 2014

ఐశ్వర్యకు షాక్‌!

ఐశ్వర్యకు షాక్‌!

బాలీవుడ్‌ బ్యూటీ, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్‌కి పెళ్లయి తన భర్త అభిషేక్‌ బచ్చన్‌తో హ్యాపీగా పిల్లతో జీవిస్తుంటే ఇప్పుడు అకస్మాత్తుగా శ్రీలంకకు చెందిన ఓ వ్యక్తి ఐష్‌ తో ఎఫైర్‌ ఉందంటూ ఫిర్యాదులు చేస్తూ గందరగోళం చేస్తున్నాడు. సదరు వ్యక్తి శ్రీలంకకు చెందిన నిరోషన్‌ దేవప్రియగా చెపుతున్నారు. తాను గతంలో ఐశ్వర్యారాయ్‌తో రిలేషన్‌ aishwarya raiకొనసాగించినట్లు చెపుతున్నాడు. ఐశ్వర్యారాయ్‌తో తనకు రిలేషన్‌ ఉన్నదనీ, తమ మధ్య ఆ రిలేషన్‌ కొనసాగుతుండగానే హఠాత్తుగా అభిషేక్‌ బచ్చన్‌ ఆమెను పెళ్లాడాడని పేర్కొన్నాడు. ఐష్‌ను అభిషేక్‌ పెళ్లి చేసుకోవడంతో తను తీవ్రమైన మనోవేదనకు గురయ్యానని కూడా చెప్పుకున్నాడు. అంతేకాదు… ఈ వ్యక్తి తను వేసిన పిటీషన్‌ పై తన తరపున వాదించేందుకు ఓ న్యాయవాదిని కూడా నియమించుకున్నాడు. ఐతే ఐశ్వర్యారాయ్‌ కు పెళ్లయిపోయి ఓ పాప పుట్టి, మళ్లీ గర్భవతి అనే వార్తలు వస్తున్న నేపధ్యంలో ఇపుడు ఐష్‌ తన ప్రియురాలు అంటూ రావడం చర్చనీయాంశమైంది. మరి ఇతడు ఏ రకంగా ఐశ్వర్యారాయ్‌ తన ప్రియురాలు అని కోర్టులో నిరూపిస్తాడో చూడాలి.